Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఎన్ఎస్ఎఫ్‌ లో ముసలం... కొడాలి రవి రాజీనామా... టీఆర్ఎస్ లో చేరే యోచన!

తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్ - తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్) ప్రధాన కార్యదర్శి కొడాలి రవికుమార్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెరాసలో చేరడానికి యోచిస్తున్నట్లు సమాచారం. కొడాలి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా వున్న కొడాలి రవి రాజీనామాతో టీఎన్ఎస్ఎఫ్‌ లో అసంతృప్తి ముసలం బయలుదేరినట్టు అయింది. ఆయనతో పాటు మరింతమంది నేతలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రవి రాజీనామాపై గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News